నిజామాబాద్ లో రెండో రోజు కూడా కొనసాగిన గణేష్ నిమజ్జన యాత్ర.
తెలంగాణ, నిజామాబాద్. 7 సెప్టెంబర్ (హి.స.) నిజామాబాద్ జిల్లాలో నిన్న ప్రారంభమైన గణేష్ ప్రతిమల నిమజ్జన యాత్ర నేను కూడా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి బాసర, ఉమ్మెడ వద్ద నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ కమిషనర్ సాయ
నిజామాబాద్ గణేష్


తెలంగాణ, నిజామాబాద్. 7 సెప్టెంబర్ (హి.స.)

నిజామాబాద్ జిల్లాలో నిన్న

ప్రారంభమైన గణేష్ ప్రతిమల నిమజ్జన యాత్ర నేను కూడా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి బాసర, ఉమ్మెడ వద్ద నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సిబ్బంది పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టారు. అలాగే సీపీ సాయి చైతన్య స్వయంగా నిమజ్జనం జరిగే ప్రదేశాలను సందర్శించి పర్యవేక్షించారు. నిమజ్జన ప్రాంతాలలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాలు, నిమజ్జన కార్యక్రమాలు కొనసాగాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande