తెలంగాణ పోరాటస్ఫూర్తికి నిలువెత్తు రూపం రావి నారాయణ రెడ్డి: కేటీఆర్
హైదరాబాద్, 7 సెప్టెంబర్ (హి.స.) స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు రావి నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ప్రాంత రాజకీయ చైతన్యానికి, పోరాటస్ఫూర్తికి న
రావి నారాయణరెడ్డి


హైదరాబాద్, 7 సెప్టెంబర్ (హి.స.)

స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు రావి నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ప్రాంత రాజకీయ చైతన్యానికి, పోరాటస్ఫూర్తికి నిలువెత్తు రూపం రావి నారాయణ రెడ్డి అని చెప్పారు. ఆనాటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన గొప్ప ఉద్యమకారుడు, ప్రజాస్వామ్యవాది, కమ్యూనిస్ట్ నాయకుడని తెలిపారు.

విద్యా సంస్థలు, వసతి గృహాలు ఏర్పాటు చేసి విద్యావ్యాప్తికి కృషి చేసిన మహనీయులన్నారు. భారతదేశ తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా రికార్డు మెజార్టీతో గెలుపొందిన అరుదైన రికార్డు ఆయన సొంతం. రావి నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా.. వారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుందామని ప్రతినబూనుదామని పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande