హైదరాబాద్, 7 సెప్టెంబర్ (హి.స.)
రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) మద్దతు తెలిపింది. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారని పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. సహచర హైదరాబాదీ, న్యాయనిపుణులు సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ ఓవైసీ నిన్న ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ మద్దతుకి సీఎం రేవంత్ రెడ్డి థ్యాంక్స్ చెప్పారు. జాతీయ ప్రయోజనాల ఉమ్మడి ఉద్దేశంతో జస్టి సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలిపినందుకు అసదుద్దీన్ ఓవైసీకి ధన్యవాదాలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాగా, సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..