తెలంగాణ, వేములవాడ. 7 సెప్టెంబర్ (హి.స.)
మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజి కింద ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఆదివారం పంపిణీ చేశారు. వేములవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మొత్తం 1550 మందికి ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..
మిడ్ మానేర్ ప్రాజెక్టు నిర్వాసితులకు మేలు చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రూ.240 కోట్లతో ముంపు గ్రామాల ప్రజలకు 4696 ఇళ్లు మంజూరు చేశామని వెల్లడించారు. ప్రత్యేక ప్యాకెజీ కింద ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సమస్యల పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.మిడ్ మానేరు ప్రాజెక్ట్ నిర్మాణములో నిర్వాసితులైన తొమ్మిది గ్రామాల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా 1,550 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశామని, ఒక్కో ఇంటికి రూ. ఐదు లక్షల చొప్పున లబ్ధి చేకూరనున్నదని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు