శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం.. నిన్న రాత్రి నుంచి ఇళ్ల మధ్యలోనే
శ్రీశైలం, 7 సెప్టెంబర్ (హి.స.)వరుస సెలవులు, వినాయక నిమజ్జనాలతో శ్రీశైలానికి పర్యాటకులు, భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో గత రెండు రోజుల నుంచి చిరుత సంచారం శ్రీశైలం పట్టణ (Srisailam town) వీధుల్లో కలకలం సృష్టిస్తుంది. మొద నిన్న రాత్రి కనిపించిన చిరుత (Le
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం.. నిన్న రాత్రి నుంచి ఇళ్ల మధ్యలోనే


శ్రీశైలం, 7 సెప్టెంబర్ (హి.స.)వరుస సెలవులు, వినాయక నిమజ్జనాలతో శ్రీశైలానికి పర్యాటకులు, భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో గత రెండు రోజుల నుంచి చిరుత సంచారం శ్రీశైలం పట్టణ (Srisailam town) వీధుల్లో కలకలం సృష్టిస్తుంది. మొద నిన్న రాత్రి కనిపించిన చిరుత (Leopard).. రాత్రి 9 గంటల సమయంలో ఓ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. ఇది గమనించిన స్థానికులు బిగ్గరగా అరవడంతో.. చిరుతపులి (Leopard) అక్కడి నుంచి పారిపోయింది. అనంతరం ఈ రోజు ఉదయం పాతాళగంగ (Patal Ganga) మెట్ల వద్ద ఉన్న పంప్ హౌస్ వద్ద మరోసారి చిరతు ప్రత్యక్షమైంది. ఇది గమనించిన స్థానికులు చిరుత సంచారాన్ని వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో స్థానికులు, పర్యాటకు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు (Forest officials) వెంటనే స్పందించి చిరుతను పట్టుకునే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande