చీరాల, 8 సెప్టెంబర్ (హి.స.)
: తక్కువ ధరకే బంగారం ఆశ చూపి కర్ణాటక రాష్ట్రానికి చెందిన మాయగాళ్లు అదే రాష్ట్రానికి చెందిన వారిని మోసం చేసేందుకు చీరాల మండలం ఈపూరుపాలెం కేంద్రంగా వల పన్నారు. పథకం ప్రకారం రూ.14 లక్షల నగదును అపహరించుకుని కారులో ఉడాయిస్తుండగా.. అప్రమత్తమైన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను అరెస్టు చేశారు. సినీ ఫక్కీలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ మొయిన్ ఆదివారం చీరాల గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వివరించారు. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా శికారిపుర తాలూకా దొడ్డపేటకు చెందిన నాగరాజు స్వర్ణకారుడు. అదే రాష్ట్రంలోని గంగావతికి చెందిన సాతుపాటి యువరాజు నాలుగు నెలల క్రితం కుమార్ అన్న పేరుతో నాగరాజుకు ఫోన్ చేశాడు. చీరాల ప్రాంతంలో తక్కువ ధరకే బంగారం వస్తున్నట్లు ఆశ చూపాడు. అతడి మాటలు నిజమో కాదో అని నిర్ధరించుకునేందుకు నాగరాజు ఈపూరుపాలెం రాగా.. అప్పటికే అక్కడ ఉన్న యువరాజు బంగారం చూపించాడు. పరీక్షించుకున్న అనంతరం బాధితుడు ఈ నెల 6న తన సోదరుడితో కలిసి రూ.14 లక్షలతో ఈపూరుపాలెం చేరుకున్నారు. అప్పటికే కారులో అక్కడికి మరో ఆరుగురితో కలిసి వచ్చిన యవరాజు వీరిద్దరిని పొలాల్లోకి తీసుకెళ్లి ముందు నగదు చూపించమని కోరారు. చూపిన వెంటనే కత్తులతో బెదిరించి నగదుతో పాటు సెల్‌ఫోన్లు లాక్కొని కారులో ఉడాయించారు. బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాలతో అప్రమత్తమైన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులు నరసరావుపేట మీదుగా దోర్నాల వైపు వెళ్లినట్లు తెలుసుకుని సీఐ శేషగిరిరావు, ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు దోర్నాల వెళ్లి ప్రధాన నిందితుడు యువరాజుతో పాటు బేతాడి శశికుమార్, బేతవాది నాగరాజు, దొడ్డ గజ్జిలేర్ కిషోర్‌కుమార్, సూరతాని
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ