తెలంగాణ బీజేపీ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
న్యూఢిల్లీ,08,సెప్టెంబర్ (హి.స.) సీఎం రేవంత్ రెడ్డి పై తెలంగాణ బీజేపీ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజకీయ పోరాటాలకు కోర్టును వేదిక చేసుకోవద్దు అని చురకలంటించింది. కోర్టులు ఈ విషయాన్ని పదే పదే చెప్తూనే ఉన్నాయని తెలిపింది. రాజకీయాలతోనే
Court


న్యూఢిల్లీ,08,సెప్టెంబర్ (హి.స.) సీఎం రేవంత్ రెడ్డి పై తెలంగాణ బీజేపీ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజకీయ పోరాటాలకు కోర్టును వేదిక చేసుకోవద్దు అని చురకలంటించింది. కోర్టులు ఈ విషయాన్ని పదే పదే చెప్తూనే ఉన్నాయని తెలిపింది. రాజకీయాలతోనే ఎదుర్కోవాలని పేర్కొంది.. కేసు డిస్మిస్ చేశాక, బీజేపీ తరపున న్యాయవాది పొడిగించే ప్రయత్నం చేస్తున్నాడని అసహనం వ్యక్తం చేశాడు చీఫ్ జస్టిస్.. రూ. 10 లక్షల జరిమానా విధిస్తామని బీజేపీ తరపు న్యాయవాదిని చీఫ్ జస్టిస్ హెచ్చరించారు.

2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొత్తగూడెం సభలో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని ఆరోపిస్తూ ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు గతేడాది హైదరాబాద్‌ ప్రజాప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని రేవంత్‌రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. దీనిపై కోర్టు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్‌-125 కింద కేసు కొనసాగుతుందని తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande