గుండెపోటుకు గురై కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన మల్కాజిగిరి లో జరిగింది
అమరావతి, 8 సెప్టెంబర్ (హి.స.) గౌతంనగర్‌: గుండెపోటుకు గురై కానిస్టేబుల్‌ మృతి చెందిన ఘటన మల్కాజిగిరిలో జరిగింది. సీఐ సత్యనారాయణ వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ డేవిడ్‌(31) మల్కాజిగిరి విష్ణుపురికాలనీలో నివసిస్తున్నారు. నిమజ్జనోత్స
గుండెపోటుకు గురై కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన మల్కాజిగిరి లో జరిగింది


అమరావతి, 8 సెప్టెంబర్ (హి.స.)

గౌతంనగర్‌: గుండెపోటుకు గురై కానిస్టేబుల్‌ మృతి చెందిన ఘటన మల్కాజిగిరిలో జరిగింది. సీఐ సత్యనారాయణ వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ డేవిడ్‌(31) మల్కాజిగిరి విష్ణుపురికాలనీలో నివసిస్తున్నారు. నిమజ్జనోత్సవంలో భాగంగా ఆదివారం ఆనంద్‌బాగ్‌లో నృత్యం చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో గాంధీకి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయనకు మూడు నెలల పాప ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande