న్యూఢిల్లీ,08,సెప్టెంబర్ (హి.స.): దేశంలో ఓట్ల దొంగలను స్వయానా కేంద్ర ఎన్నికల సంఘమే కాపాడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. పదేళ్లుగా ఓటు చోరులను కాపాడే బ్యాక్ ఆఫీస్‌లాగా ఈసీ పని చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన సంస్థ ఓట్ల దొంగలకు రక్షణ కవచంలా మారిందని నిప్పులు చెరిగారు.
కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గ ఓటర్ ఫ్రాడ్ కేసులో ఈసీ వైఖరిని ఆయన నిలదీశారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో ఖర్గే పోస్టు చేశారు. కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో ఓటర్ ఫ్రాడ్ కేసులో ఎన్నికల సంఘం వైఖరిని ఆయన తప్పుపట్టారు. కీలకమైన ఆధారాలను దాచిపెట్టారని విమర్శించారు. 2023లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలంద్ నియోజకవర్గంలో వేలాది ఓటర్ల పేర్లు తొలగించేందుకు నకిలీ ఫామ్–7 దరఖాస్తులు వాడినట్లు కాంగ్రెస్ బహిర్గతం చేసింది.
దీనిపై కేసు నమోదు కాగా, దర్యాప్తులో 5,994 నకిలీ అప్లికేషన్లు బయటపడ్డాయి. ఇది చిన్న తప్పిదం కాదని, ఓటు హక్కును దోచుకోవడానికి పన్నిన పెద్ద కుట్ర అని ఖర్గే ధ్వజమెత్తారు. ఈ కేసులో నిందితులను గుర్తించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశాలు ఇచి్చంది. తొలుత ఎన్నికల సంఘం కొన్ని పత్రాలు సమరి్పంచినప్పటికీ ఇప్పుడు మాత్రం కీలక ఆధారాలను ఇవ్వకుండా వెనక్కి తగ్గిందని ఖర్గే ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ