పల్నాడు జిల్లా.తురకపాలెంలో నేడు.ఐ కార్ బృందం పర్యటించనుంది
గుంటూరు, 8 సెప్టెంబర్ (హి.స.) , పల్నాడు జిల్లా తురకపాలెంలో ఇవాళ(సోమవారం) ICAR బృందం పర్యటించనుంది. అక్కడి మట్టి నమూనాలు సేకరించబోతోంది. ఇప్పటికే తురకపాలెంలో ఎయిమ్స్ బృందం వైద్యులు పర్యటించి గ్రామస్తుల రక్త నమూనాలు సేకరించారు. ''మెలియాయిడోసిస్‌''
పల్నాడు జిల్లా.తురకపాలెంలో నేడు.ఐ కార్ బృందం పర్యటించనుంది


గుంటూరు, 8 సెప్టెంబర్ (హి.స.)

, పల్నాడు జిల్లా తురకపాలెంలో ఇవాళ(సోమవారం) ICAR బృందం పర్యటించనుంది. అక్కడి మట్టి నమూనాలు సేకరించబోతోంది. ఇప్పటికే తురకపాలెంలో ఎయిమ్స్ బృందం వైద్యులు పర్యటించి గ్రామస్తుల రక్త నమూనాలు సేకరించారు. 'మెలియాయిడోసిస్‌' లక్షణాలున్న తురకపాలెం గ్రామానికి చెందిన ఆరుగురికి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు.

ఈ క్రమంలో ఇవాళ భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ICAR) బృందం పర్యటించి గ్రామంలోని వ్యవసాయ భూముల నుండి మట్టి నమూనాలను సేకరించి, నీటి సరఫరా, మట్టి ఫలదీకరణ స్థితిని విశ్లేషించనుంది. దీంతోపాటు, ICAR బృందం గ్రామస్తులతో సమావేశమై, వారి అనుభవాలు, సమస్యలపై చర్చించి, సాంకేతిక సలహాలు అందించనుంది.

మరోవైపు, ఎయిమ్స్ బృందం తీసుకున్న గ్రామస్తుల రక్తనమూనాల ఆధారంగా గ్రామంలో ఆరోగ్య సమస్యలను గుర్తించి, తగిన చికిత్స అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో వైద్య సిబ్బంది గ్రామస్తుల ఆరోగ్య పరిస్థితిని తనిఖీ చేస్తూ, మరికొందరి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. ఈ పరీక్షల్లో మట్టి, నీటి కలుషితం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande