ఛోక్సీని ముంబయి జైలులో బ్యారక్‌ నంబర్‌ 12లో ఉంచనున్నారు
న్యూఢిల్లీ,08,సెప్టెంబర్ (హి.స.)పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రూ.వేల కోట్లు ఎగవేసి పారిపోయిన వ్యాపారవేత్త, ఆర్థిక నేరగాడు మెహుల్‌ ఛోక్సీని తమకు అప్పగిస్తే అతడిని ఏకాంతంగా నిర్బంధించమని బెల్జియంకు భారత్‌ హామీ ఇచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ సౌకర
Kakkanad District Jail drug case,


న్యూఢిల్లీ,08,సెప్టెంబర్ (హి.స.)పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రూ.వేల కోట్లు ఎగవేసి పారిపోయిన వ్యాపారవేత్త, ఆర్థిక నేరగాడు మెహుల్‌ ఛోక్సీని తమకు అప్పగిస్తే అతడిని ఏకాంతంగా నిర్బంధించమని బెల్జియంకు భారత్‌ హామీ ఇచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ సౌకర్యాలను ఏర్పాటుచేస్తామని పేర్కొంది.

బెల్జియం(Belgium) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛోక్సీ(Mehul Choksi)ని ముంబయి జైలులో బ్యారక్‌ నంబర్‌ 12లో ఉంచనున్నారు. అందులో ఎక్కువమంది ఖైదీలు ఉండరు. అంతేకాకుండా ఛోక్సీని బంధించే సెల్‌పై 24 గంటలు నిఘా ఉంటుంది. ఫర్నిచర్‌ కాకుండా 3 చదరపు మీటర్ల స్థలం అందుబాటులో ఉంటుంది. ఈ సెల్‌లో సరిపడా గాలి, వెలుతురు, వస్తువులు దాచుకునే సౌకర్యం, కాటన్‌ పరుపు, దిండ్లు, బెడ్‌షీట్, దుప్పటి ఏర్పాటుచేస్తారు. వైద్య సౌకర్యాలకు తగినట్లుగా బెడ్‌ ఉంటుంది. శుద్ధమైన తాగునీరు, అత్యవసర వైద్య సదుపాయం కల్పిస్తారు. పరిశుభ్రమైన మరుగుదొడ్లతోపాటు.. వాటిని ఎప్పటికప్పుడు కడిగించే ఏర్పాట్లు చేయనున్నారు. ఇక, మెహుల్ ఛోక్సీ(Mehul Choksi)కి రోజూ గంటకు పైగా వ్యాయామం చేసుకోవడానికి అనుమతిస్తారు. నిర్బంధం కాలంలో సరిపడా ఆహారం అందిస్తారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande