కోస్తాలో అనేక చోట్ల. ఎండ తీవ్రంగా ఉంది
విశాఖపట్నం, 8 సెప్టెంబర్ (హి.స.) ,:వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం ఆదివారం స్థిరంగా కొనసాగింది. కోస్తాలో అనేకచోట్ల ఎండ తీవ్రంగా ఉంది. కావలిలో 38.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు కోస్తాలో పలుచోట్ల వాతావరణ
Floods in AP


విశాఖపట్నం, 8 సెప్టెంబర్ (హి.స.)

,:వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం ఆదివారం స్థిరంగా కొనసాగింది. కోస్తాలో అనేకచోట్ల ఎండ తీవ్రంగా ఉంది. కావలిలో 38.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు కోస్తాలో పలుచోట్ల వాతావరణ అనిశ్చితితో ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. చేబ్రోలులో 7.4, గూడవల్లిలో 5.8, ఎస్‌.రాయవరంలో 4.8, పార్వతీపురంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande