తెరచిన తిరుమల.శ్రీవారి ఆలయం సర్వదర్శన్ టోకెన్లు రద్దు
అమరావతి, : తిరుమలలో చంద్రగ్రహణం ముగియగానే ఆలయ ద్వారాలు మళ్లీ భక్తుల కోసం తెరుచుకున్నాయి. గ్రహణం కారణంగా మూసివేసిన ఆలయాన్ని శుద్ధి కార్యక్రమాల అనంతరం తిరిగి ప్రారంభించారు. గ్రహణం వీడిన వెంటనే ఆలయంలో సంప్రోక్షణ, పవిత్ర కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం క
Radhakrishnan


అమరావతి, : తిరుమలలో చంద్రగ్రహణం ముగియగానే ఆలయ ద్వారాలు మళ్లీ భక్తుల కోసం తెరుచుకున్నాయి. గ్రహణం కారణంగా మూసివేసిన ఆలయాన్ని శుద్ధి కార్యక్రమాల అనంతరం తిరిగి ప్రారంభించారు. గ్రహణం వీడిన వెంటనే ఆలయంలో సంప్రోక్షణ, పవిత్ర కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం కలియుగ దైవం శ్రీనివాసుడికి ఏకాంతంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఈ పూజల తర్వాత భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇచ్చారు. అయితే, ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేయడం జరిగింది అని టీటీడీ అధికారులు తేల్చి చెప్పారు.

అలాగే, శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులకు జారీ చేసే టోకెన్లు కూడా రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు తెలియజేశారు. సాధారణంగా తెల్లవారుజామునే శుద్ధి కార్యక్రమాలు పూర్తిచేసి ఆలయ ద్వారాలను తెరిచారు.

గ్రహణం కారణంగా ఏర్పడిన ఈ ప్రత్యేక పరిస్థితుల మధ్య, తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande