న్యూఢిల్లీ,08,సెప్టెంబర్ (హి.స.) భారతదేశ ఉపరాష్ట్రపతి పదవి కోసం సెప్టెంబర్ 9 అంటె రేపు ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి లు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. వెనువెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడించనున్నారు. “ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్”గా వ్యవహరించనున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పి.సి. మోడి. “ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్”కు సహాయకులుగా మరో ఇద్దరు “ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు” నియమించారు.
ఓటు వృధా కాకుండా ముందు జాగ్రత్తగా అధికార, ప్రతిపక్ష కూటములు “మాక్ ఓటింగ్” నిర్వహించారు. పార్టీలు జారీ చేసే “విప్” లు చెల్లవు..“సీక్రెట్ బ్యాలట్” విధానంలో ఎన్నికలు జరగనున్నాయి. అధికార “ఎన్.డి.ఏ” కూటమి అభ్యర్థి గెలుపు పై ధీమా ఉన్నా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న బిజేపి. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు పాత పార్లమెంట్ భవనం లోని “సెంట్రల్ హాల్” లో “మాక్ ఓటింగ్” లో “ఇండియా” కూటమి పక్షాల ఎంపీలు పాల్గొననున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ