విజయనగరం లోని.నాగవంశం వీధి కాళ్ళనాయుడు మందిరం సమీపంలో వినాయక నిమజ్జనం లో ఉద్రిక్తత
విజయనగరం, 8 సెప్టెంబర్ (హి.స.) , విజయనగరంలోని నాగవంశం వీధి కాళ్లనాయుడు మందిరం సమీపంలో వినాయక నిమజ్జనం సందర్భంగా శనివారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఈక్రమంలో తెదేపా నాయకుడిపై వైకాపాకు చెందిన పలువురు దాడి చేశారు. బాధితుడి వివరాల ప్రకారం.. ఊరేగింపు సమయ
ganesh


విజయనగరం, 8 సెప్టెంబర్ (హి.స.)

, విజయనగరంలోని నాగవంశం వీధి కాళ్లనాయుడు మందిరం సమీపంలో వినాయక నిమజ్జనం సందర్భంగా శనివారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఈక్రమంలో తెదేపా నాయకుడిపై వైకాపాకు చెందిన పలువురు దాడి చేశారు. బాధితుడి వివరాల ప్రకారం.. ఊరేగింపు సమయంలో వైకాపాకు చెందిన ఓ నాయకుడి అనుచరులు కవ్వింపు చర్యలకు దిగారు. ఈక్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు, వార్డు నాయకుడు గాడు l సముదాయించారు. ఇంతలో కొంతమంది చేరుకుని దాడి చేశారు. అప్పారావుకు గాయాలు కాగా మహారాజా ఆసుపత్రికి తరలించారు. నాయకులు అవనాపు విజయ్, కాళ్ల గౌరీశంకర్‌ తదితరులు పరామర్శించారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చరవాణిలో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే సహకారంతో కావాలనే దాడి చేశారని, చర్యలు తీసుకోవాలని 9 మందిపై అప్పారావు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఒకటో

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande