అమెరికా దిగుమతులపై 75 శాతం సుంకం విధించండి- కేజ్రీవాల్..
న్యూఢిల్లీ,08,సెప్టెంబర్ (హి.స.): ‘మోదీజీ..ట్రంప్‌కు మీ దమ్మేంటో చూపించండి. యావత్‌దేశం మొత్తం మీ వెంట ఉంది’అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్ర మోదిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మా
Aam Aadmi Party (AAP) national convener Arvind Kejriwal


న్యూఢిల్లీ,08,సెప్టెంబర్ (హి.స.): ‘మోదీజీ..ట్రంప్‌కు మీ దమ్మేంటో చూపించండి. యావత్‌దేశం మొత్తం మీ వెంట ఉంది’అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్ర మోదిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రధాని నరేంద్రమోదీ ట్రంప్‌కు మీ దమ్మేంటో చూపించండి. దేశం మొత్తం మీ వెనుక ఉంది. అమెరికా మన ఎగుమతులపై 50 శాతం సుంకం విధిస్తోంది. మీరు అమెరికా దిగుమతులపై 75 శాతం సుంకం విధించండి. ట్రంప్ తలవంచుతాడో లేదో చూడండి’అని అన్నారు.

ఈ సందర్భంగా..కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమెరికా పత్తి దిగుమతులపై 11 శాతం సుంకం మినహాయింపు ఇచ్చిన నిర్ణయాన్ని కేజ్రీవాల్‌ తీవ్రంగా విమర్శించారు. అమెరికా పత్తి దిగుమతి వల్ల మన రైతులకు మార్కెట్‌లో రూ.900 కన్నా తక్కువ ధర వస్తుంది. అమెరికా రైతులు ధనవంతులు అవుతారు, గుజరాత్ రైతులు బీదవుతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande