ముంబయి,08 సెప్టెంబర్ (హి.స.) మహారాష్ట్రలోని సముద్రతీరానికి మూడు అనుమానాస్పద కంటైనర్లు (Suspicious Containers) కొట్టుకురావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాల్ఘర్ జిల్లాలోని సత్పతి, షిర్గావ్ బీచ్‌లకు మూడు అనుమానాస్పద కంటైనర్లు కొట్టుకురావడంతో భద్రతా, విపత్తు నిర్వహణ సంస్థలను అలర్ట్ చేసినట్లు పోలీసులు (Palghar cops) పేర్కొన్నారు. ఈ సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని.. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అందులో ఏముందనే? కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీంతో తీర గ్రామాలను అలర్ట్ చేసి.. బీచ్‌ల వెంబడి ముమ్మరంగా పెట్రోలింగ్ చేపడుతున్నట్లు తెలిపారు.
సముద్రంలో అధిక ఆటుపోట్లు ఉండడం వల్ల ప్రస్తుతం కంటైనర్లను తెరవడం కష్టతరంగా మారిందని.. ఓ కంటైనర్ పాక్షికంగా మునిగిపోయిందని అధికారులు తెలిపారు. పోలీసులు, సముద్ర నిఘా అధికారులు, కోస్ట్ గార్డ్‌లు సమన్వయంతో పని చేస్తూ.. కంటైనర్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి షిప్పింగ్ లాగ్‌లు, తీరప్రాంత నిఘా డేటా ద్వారా దర్యాప్తు చేస్తున్నారన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ