న్యూఢిల్లీ,08,సెప్టెంబర్ (హి.స.)భారత్, అమెరికా సంబంధాలపై ట్రంప్ సానుకూలంగా మాట్లాడగానే ప్రధాని నరేంద్రమోదీ స్పందించడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని త్వరగా స్పందించినప్పటికీ, రెండు దేశాల ప్రభుత్వాలు, దౌత్యవేత్తలు చేయాల్సిన తీవ్రమైన మరమ్మతులు మిగిలే ఉన్నాయన్నారు. ట్రంప్ కొత్త స్వరాన్ని జాగ్రత్తగా స్వాగతిస్తున్నామని తెలిపారు. భారతీయులు ఎదుర్కొన్న పరిణామాలను దృష్టిలోఉంచుకొని ట్రంప్ వల్ల కలిగిన బాధ, అవమానాన్ని త్వరగా మర్చిపోలేమన్నారు. అధ్యక్షుడు, ఆయన సిబ్బంది చేసిన అవమానాలు చాలా ఉన్నాయన్నారు. ట్రంప్ పాదరస స్వభావం కలిగిన వ్యక్తి అని థరూర్ అభివర్ణించారు.
‘ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) చాలా త్వరగా స్పందించారు. సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం అనే ప్రాథమిక సంబంధం గురించి విదేశాంగ మంత్రి కూడా నొక్కి చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ