న్యూఢిల్లీ,08,సెప్టెంబర్ (హి.స.) జమ్మూకాశ్మీర్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నుంచి భద్రతా దళాలు ముష్కరుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కీలక ఉగ్రవాదులందరిని హతమార్చారు. తాజాగా సోమవారం కూడా జేకే కుల్గాంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. గుడార్ అటవీ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారం అందడంతో భద్రతా దళాలు మోహరించాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లుగా తెలుస్తోంది. అలాగే ఒక ఆర్మీ జవాన్ గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
ఇక ఆదివారం అర్ధరాత్రి జమ్మూలోని ఆర్ఎస్ పురా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఒక పాకిస్థాన్ చొరబాటుదారుడిని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. చొరబాటుదారుడు పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గోధ నివాసి సిరాజ్ ఖాన్‌గా గుర్తించారు. రాత్రి 9:20 గంటలకు చొరబాటుకు యత్నిస్తుండగా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ