పాకిస్తాన్ గుల్ ప్లాజాలో భారీ అగ్నిప్రమాదం.. 10కి చేరిన మృతులు, మరో 60 మంది గల్లంతు
హైదరాబాద్, 19 జనవరి (హి.స.) పాకిస్థాన్లోని కరాచీలో ఉన్న ప్రసిద్ధ గుల్ ప్లాజా షాపింగ్ మాల్ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం రాత్రి మరో నాలుగు మృతదేహాలను వెలికితీయడంతో మొత్తం మృతుల సంఖ్య 10కి చేరుకుంది. మృతులలో ఒక చిన్నారి కూడా ఉన్
పాకిస్తాన్ ఫైర్


హైదరాబాద్, 19 జనవరి (హి.స.)

పాకిస్థాన్లోని కరాచీలో ఉన్న ప్రసిద్ధ గుల్ ప్లాజా షాపింగ్ మాల్ అగ్నిప్రమాదం

తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం రాత్రి మరో నాలుగు మృతదేహాలను వెలికితీయడంతో మొత్తం మృతుల సంఖ్య 10కి చేరుకుంది. మృతులలో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భవనంలో ఇంకా మంటలు పూర్తిగా అదుపులోకి రాకపోవడం, దట్టమైన పొగ కమ్ముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, సుమారు 58 నుంచి 60 మంది వరకు గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి.

ప్రమాద తీవ్రత దృష్ట్యా పాకిస్థాన్ సైన్యం కూడా రంగంలోకి దిగింది. భవనం లోపల చిక్కుకున్న వారిని గుర్తించడానికి థర్మల్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. సుమారు 22 ఫైర్ ఇంజన్లు, 33 అంబులెన్స్లతో భారీ ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గోడలను పగలగొట్టి, కిటికీలను కట్ చేస్తూ లోపలికి వెళ్లేందుకు రెస్క్యూ టీమ్స్ ప్రయత్నిస్తున్నాయి.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande