స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం: పట్టాలు తప్పి ఢీకొన్న రెండు హై-స్పీడ్ రైళ్లు, 21 మందికి పైగా మృతి
హైదరాబాద్, 19 జనవరి (హి.స.) ఓ హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి మరో రైలును ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటు చేసుకొని 21 మంది ప్రాణాలు కోల్పోయిన షాకింగ్ సంఘటన దక్షిణ స్పేయిన్లోని కోర్డోబా ప్రావిన్స్లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. మలగా నుండి మాడ్రిడ్ వెళ్తు
రైలు ప్రమాదం


హైదరాబాద్, 19 జనవరి (హి.స.) ఓ హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి మరో

రైలును ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటు చేసుకొని 21 మంది ప్రాణాలు కోల్పోయిన షాకింగ్ సంఘటన దక్షిణ స్పేయిన్లోని కోర్డోబా ప్రావిన్స్లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. మలగా నుండి మాడ్రిడ్ వెళ్తున్న 'ఇరియో' అనే ప్రైవేట్ హై-స్పీడ్ రైలు అడముజ్ ప్రాంతం వద్ద పట్టాలు తప్పి, పక్క ట్రాక్పైకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఎదురుగా మాడ్రిడ్ నుండి హుయెల్వా వస్తున్న 'రెన్ఫే' సంస్థకు చెందిన మరో రైలును ఇది బలంగా ఢీకొట్టడంతో ఈ దారుణ ఘటన సంభవించింది.

ఈ ప్రమాదంలో రెండు రైళ్లు నుజ్జునుజ్జు అవ్వగా, సుమారు 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 30 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande