చిలీలో కార్చిచ్చు బీభత్సం.. అత్యవసర పరిస్థితి విధింపు
చిలీ, 19 జనవరి (హి.స.) దక్షిణ అమెరికా దేశమైన చిలీలో కార్చిచ్చు (Wildfires) ప్రళయం సృష్టిస్తోంది. వేల ఎకరాల అడవిని దహించివేస్తూ మంటలు వేగంగా గ్రామాలకు విస్తరిస్తుండటంతో చిలీ ప్రభుత్వం ప్రభావిత ప్రాంతాల్లో ''ఎమర్జెన్సీ'' (అత్యవసర పరిస్థితిని) ప్రక
fire-disaster-in-chile-state-of-emergency-imposed-515


చిలీ, 19 జనవరి (హి.స.)

దక్షిణ అమెరికా దేశమైన చిలీలో కార్చిచ్చు (Wildfires) ప్రళయం సృష్టిస్తోంది. వేల ఎకరాల అడవిని దహించివేస్తూ మంటలు వేగంగా గ్రామాలకు విస్తరిస్తుండటంతో చిలీ ప్రభుత్వం ప్రభావిత ప్రాంతాల్లో 'ఎమర్జెన్సీ' (అత్యవసర పరిస్థితిని) ప్రకటించింది. ఎడతెరిపి లేకుండా వీస్తున్న గాలులు, తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి సవాలుగా మారింది. ఇప్పటికే వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతవ్వగా, అధికారులు వేల సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande