బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత.. గాలి జనార్దన్‌పై కేసు నమోదు
బెంగళూరు/ఢిల్లీ.,02 జనవరి (హి.స.): రాజకీయ ఘర్షణలు.. ఇరు వర్గాల గన్‌ ఫైట్‌తో కర్ణాటక బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి అనుచరులు, గంగావతి బీజేపీ ఎమ్మెల్యే.. మాజీమంత్రి గాలి జనార్దన్‌రెడ్డి వర్గీయుల మధ్య ఫ్లె
బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత.. గాలి జనార్దన్‌పై కేసు నమోదు


బెంగళూరు/ఢిల్లీ.,02 జనవరి (హి.స.): రాజకీయ ఘర్షణలు.. ఇరు వర్గాల గన్‌ ఫైట్‌తో కర్ణాటక బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి అనుచరులు, గంగావతి బీజేపీ ఎమ్మెల్యే.. మాజీమంత్రి గాలి జనార్దన్‌రెడ్డి వర్గీయుల మధ్య ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో వివాదం చెలరేగింది. అది చినికి చినికి గాలివానగా మారి.. కాంగ్రెస్‌-గాలి వర్గీయులు పరస్పరం దాడులకు దిగారు. ఇది కాల్పులకు దారి తీయడంతో ఒకరు మృతి చెందారు.

బళ్లారిలోని గాలి జనార్దన్‌రెడ్డి నివాసం వద్ద గురువారం రాత్రి కాంగ్రెస్‌-బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. అనంతరం జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇది తనపై జరిగిన హత్యాయత్నమేనని, తాను తృటిలో తప్పించుకున్నానని గాలి జనార్దన్‌ అంటున్నారు. అయితే ఆ అవసరం తనకు లేదని.. గాలి జనార్దన్‌ జరిపిన కాల్పుల వల్లే కాంగ్రెస్‌ కార్యకర్త మృతి చెందాడని భరత్‌రెడ్డి కౌంటర్‌ ఇస్తున్నారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతంగా మారడంతో బళ్లారి సిటీలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande