
హైదరాబాద్, 02 జనవరి (హి.స.)
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది సంగీతా భిమానులకు నాలుగు దశాబ్దాలుగా వినోదం పంచిన MTV మ్యూజిక్ ఛానెల్సు తెరపడింది. పారామౌంట్ గ్లోబల్ ఆధ్వర్యంలోని MTV, డిసెంబర్ 31న తమ అనుబంధ 24 గంటల సంగీత ఛానెల్స్ను శాశ్వతంగా మూసివేసింది. దీంతో మ్యూజిక్ టెలివిజన్ చరిత్రలో ఒక కీలక అధ్యాయం ముగిసినట్లైంది.
1981 ఆగస్టు 1న MTV ప్రారంభమైన సందర్భంగా ప్రసారమైన తొలి మ్యూజిక్ వీడియో.. బగుల్స్ (The Buggles) బృందం పాడిన 'వీడియో కిల్డ్ ది రేడియో స్టార్' అనే చివరి వీడియోగా ప్రసారం చేస్తూ MTV భావోద్వేగ వీడ్కోలు పలికింది. న్యూ ఇయర్ ఈవ్ రోజున ఈ చారిత్రక క్షణం ప్రసారమవడంతో అభిమానులు భావోద్వేగంలో మునిగిపోయారు. ఈ ఏడాది ప్రారంభంలోనే 2025 నుంచి 24/7 మ్యూజిక్ ఛానెల్స్ను నిలిపివేయనున్నట్లు MTV ప్రకటించింది. దానికి అనుగుణంగా యునైటెడ్ కింగ్డమ్లో MTV Music, MTV 80s, MTV 90s, Club MTV, MTV Live వంటి ప్రముఖ ఛానెల్స్ పూర్తిగా ఆఫ్ఎయిర్ అయ్యాయి. MTV 90s ఛానెల్ చివరి వీడియోగా స్పైస్ గర్ల్స్ ప్రసిద్ధ గీతం 'గుడ్బై'ను ప్రసారం చేయడం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఛానెల్స్ను ట్యూన్ చేసిన వీక్షకులకు ఛానెల్ లోగోలు మాత్రమే మారుతూ కనిపిస్తూ, MTV కంటెంట్ను MTV HDలో వీక్షించవచ్చని సూచనలు వస్తున్నాయి.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు