తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత బర్సె దేవా
హైదరాబాద్, 02 జనవరి (హి.స.) మావోయిస్టు పార్టీ కి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్ర నేత బర్సే దేవా లొంగిపోయారు. శుక్రవారం 15 మంది మవోయిస్టులతో కలిసి తెలంగాణ డీజీపీ ఎదుట దేవా ఆయుధాలు వదిలేశారు. రేపు(శనివారం) వీరిని మీడియా ముం
మావోయిస్టు అగ్రనేత బర్సె దేవా


హైదరాబాద్, 02 జనవరి (హి.స.)

మావోయిస్టు పార్టీ కి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్ర నేత బర్సే దేవా లొంగిపోయారు. శుక్రవారం 15 మంది మవోయిస్టులతో కలిసి తెలంగాణ డీజీపీ ఎదుట దేవా ఆయుధాలు వదిలేశారు. రేపు(శనివారం) వీరిని మీడియా ముందుకు తీసుకురాబోతున్నారు. ఇటీవల మృతిచెందిన మావోయిస్టు టాప్ లీడర్ హిడ్మాకు బర్సె దేవా సన్నిహితుడు. ఇద్దరు సుదీర్ఘంగా 15 ఏండ్లపాటు కలిసి పనిచేశారు. వీరిద్దరిది ఛత్తీస్గఢ్లోని పూవర్తి గ్రామమే. మావోయిస్టు పార్టీలో అత్యంత శక్తివంతమైన పీఎల్డీఏ బెటాలియన్ నంబర్ వన్కు దేవా బాధ్యుడిగా ఉన్నారు. దీనిపై మావోయిస్టు పార్టీ నుంచి సైతం దీనిపై ఎలాంటి ప్రకటనా రాలేదు. ---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande