
హైదరాబాద్, 02 జనవరి (హి.స.)
భారత మహిళల హాకీ జట్టుకు
నెదర్లాండ్స్కు చెందిన స్టోర్డ్ మారిజ్నే మళ్లీ చీఫ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. అతన్ని హెడ్ కోచ్గా నియమించినట్టు హాకీ ఇండియా శుక్రవారం ప్రకటించింది. చీఫ్ కోచ్గా ఉన్న హరేంద్ర సింగ్ ఆటగాళ్లపై వేధింపులు, శిక్షణ సరిగ్గా లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో రాజీనామా చేశాడు. నెల రోజుల తర్వాత హాకీ ఇండియా మారిజ్నేకు బాధ్యతలు అప్పగించింది. గతంలో 2017 నుంచి 2021 వరకు మహిళల జట్టుకు అతను హెడ్ కోచ్గా ఉన్నాడు. అతని హయాంలో జట్టు టోక్యో ఒలింపిక్స్లో చారిత్రాత్మక 4వ స్థానంలో నిలిచింది.. అంతేకాకుండా, వరల్డ్ ర్యాంకింగ్స్లో టాప్-10లో నిలిచింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు