ఆ బాధ నాకు జీవితాంతం ఉంటుంది: ఆమని
అమరావతి, 02 జనవరి (హి.స.) అలనాటి స్టార్ హీరోయిన్ ఆమని పేరు చెప్పగానే 90ల నాటి హిట్ సినిమాలు వెంటనే గుర్తుకొస్తాయి. 1992లో విడుదలైన ‘జంబలకిడిపంబ’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆమని, తొలి చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత ‘మిస్టర్ ప
/amani-reveals-her-unfulfilled-wish-to-act-with-chiranjeev


అమరావతి, 02 జనవరి (హి.స.)

అలనాటి స్టార్ హీరోయిన్ ఆమని పేరు చెప్పగానే 90ల నాటి హిట్ సినిమాలు వెంటనే గుర్తుకొస్తాయి. 1992లో విడుదలైన ‘జంబలకిడిపంబ’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆమని, తొలి చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత ‘మిస్టర్ పెళ్లాం’, ‘శుభలగ్నం’, ‘మావిచిగురు’, ‘శుభ సంకల్పం’ వంటి విభిన్నమైన కథలతో వచ్చిన సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా ‘మిస్టర్ పెళ్లాం’ సినిమాలో ఆమె పోషించిన పాత్రకు గానూ ప్రతిష్ఠాత్మక నంది అవార్డు దక్కడం ఆమె కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఆమని, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, టీవీ సీరియల్స్‌లో కూడా నటిస్తూ తన నటనతో మెప్పిస్తున్నారు.

ఇదిలా ఉంటే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని తన మనసులోని ఓ తీరని కోరికను బయటపెట్టారు. ఆమె మాట్లాడుతూ... “'శుభలగ్నం', 'మిస్టర్ పెళ్లాం'లాంటి సినిమాల్లో మంచి పాత్రలు చేయగలిగినందుకు గర్వంగా ఉంది. కానీ నా కెరీర్‌లో ఒక బాధ మాత్రం ఎప్పటికీ మిగిలిపోయింది. అదే మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించలేకపోవడం” అని భావోద్వేగంగా చెప్పారు. చిన్నప్పటి నుంచే చిరంజీవి తనకు ఎంతో ఇష్టమైన హీరో అని, ఆయన పక్కన హీరోయిన్‌గా నటించాలన్న కల ఎన్నో ఏళ్లుగా తనలో ఉందని వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande