పుతిన్‌ ఇంటిపై దాడి నిజమే.. అమెరికాకు ఆధారాలు సమర్పించిన రష్యా
ఢిల్లీ.,02 జనవరి (హి.స.) యుద్ధం ముగించేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ఇల్లే లక్ష్యంగా డ్రోన్‌ దాడులు (Drone attack on Putin residence) జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఉక్రెయిన్‌ దళాలు ఈ దాడికి పాల్పడ్డాయంటూ రష్యా ఆ
Russian President Vladimir Putin


ఢిల్లీ.,02 జనవరి (హి.స.)

యుద్ధం ముగించేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ఇల్లే లక్ష్యంగా డ్రోన్‌ దాడులు (Drone attack on Putin residence) జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఉక్రెయిన్‌ దళాలు ఈ దాడికి పాల్పడ్డాయంటూ రష్యా ఆరోపించిన సంగతి తెలిసిందే. వీటిని పలు దేశాలు ఖండిస్తున్న నేపథ్యంలో.. దాడి నిజమేనని నిరూపించుకునే పనిలో పడింది రష్యా. ఇందులోభాగంగా దాడికి సంబంధించి లభ్యమైన కొన్ని ఆధారాలను అమెరికాకు అందజేసింది (Russia shares evidence with US). ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ ఓ వీడియో విడుదల చేసింది.

రష్యా (Russia) సైనిక నిఘా సంస్థ అధిపతి అడ్మిరల్ ఇగోర్ కోస్ట్యుకోవ్ మాస్కోలోని యూఎస్ మిలిటరీ అటాచ్‌ అధికారులతో భేటీ అయ్యారు. ఈసందర్భంగా కోస్ట్యుకోవ్‌ మాట్లాడుతూ.. దాడికి ఉపయోగించిన మానవరహిత విమానం శకలాలను తాము కనుగొన్నట్లు తెలిపారు. తమ దళాలు కూల్చివేసిన అనేక డ్రోన్లలోని నేవిగేషన్‌ వ్యవస్థలు చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande