ఫాస్టాగ్‌ యూజర్లకు భారీ ఊరట
ఢిల్లీ.,02 జనవరి (హి.స.) జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ వినియోగదారులకు ఊరట కల్పిస్తూ.. ఇకపై కార్లు, జీప్‌లు, వ్యాన్‌లకు కొత్తగా జారీ చేసే ఫాస్టాగ్‌లకు నో యువర్ వెహికల్ ప్రక్రియ అవసరం లేదని తెలిపింది. ఈ నిబంధన
ఫాస్టాగ్‌ యూజర్లకు భారీ ఊరట


ఢిల్లీ.,02 జనవరి (హి.స.) జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ వినియోగదారులకు ఊరట కల్పిస్తూ.. ఇకపై కార్లు, జీప్‌లు, వ్యాన్‌లకు కొత్తగా జారీ చేసే ఫాస్టాగ్‌లకు నో యువర్ వెహికల్ ప్రక్రియ అవసరం లేదని తెలిపింది. ఈ నిబంధన ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది.

వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నప్పటికీ కేవైవీ ప్రక్రియ కారణంగా ఫాస్టాగ్ యాక్టివేషన్‌లో ఆలస్యం జరుగుతోందని ఎన్‌హెచ్‌ఏ గుర్తించింది. అందుకే ఈ నిబంధనను తొలగించింది. ఇప్పటికే జారీ చేసిన ఫాస్టాగ్‌లకు కూడా కేవైవీ అవసరం లేదని స్పష్టంచేసింది.

ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కేవైవీ

ఫాస్టాగ్‌ను సరిగా అతికించకపోవడం, తప్పుగా జారీ కావడం లేదా దుర్వినియోగం జరిగే సందర్భాల్లో మాత్రమే కేవైవీ తప్పనిసరి అవుతుంది. సాధారణ వినియోగదారులకు ఇకపై ఈ ప్రక్రియ అవసరం ఉండదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande