
*బెంగళూరు,02 జనవరి (హి.స.)మెజారిటీ ప్రజలు ఈవీఎంలకు వ్యతిరేకంగా లేరని.. పక్కాగా పని చేస్తాయని నమ్ముతున్నారని కర్ణాటక నుంచి ఒక సర్వే విడుదలైంది.
2024 లోక్‌సభ ఎన్నికలపై నిర్వహించిన ఈ సర్వేలో.. 83.61 శాతం మంది ఈవీఎంలు విశ్వసించదగినవేనని వెల్లడించారు. కచ్చితమైన ఫలితాలను ఇస్తాయని 69.39 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ అథారిటీ దీనిని నిర్వహించింది. అయితే.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ అనుమతితో తాము సర్వే నిర్వహించినట్లు సదరు సంస్థ ప్రకటించుకుంది. అయితే..
ఈ సర్వేతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని ఐటీ మంత్రి ప్రిియాంక్ ఖర్గే తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించలేదని, నిర్వహించాలని ఆదేశించమూ లేదని పేర్కొన్నారు. పైగా సర్వేపై ఆయన అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ‘‘మొదటగా చెప్పేది ఏంటంటే.. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది కాదు. రెండోది.. ఈ సర్వేను కేంద్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ఎన్జీవో సమన్వయంతో నిర్వహించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ