
కోల్‌కతా/ఢిల్లీ.,02 జనవరి (హి.స.) ప్రజల కోసం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పోరాటం కొనసాగిస్తుందని ఆ పార్టీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఈ విషయంలో దుష్ట శక్తుల ఒత్తిళ్ల కు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. టీఎంసీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఎక్స్‌లో ఈ మేరకు పలు పోస్టులు చేశారు. మా, మా తి, మనుష్(తల్లి, భూమి, ప్రజలు)లకు సేవే లక్ష్యంగా టీఎంసీ 1998 జనవరి ఒకటో తేదీన ఆవిర్భవించిందని ఆమె గుర్తు చేశారు.
ఇప్పటికీ ప్రతి కార్యకర్త, ప్రతి మద్దతుదారు ఈ లక్ష్య సాధనకే కట్టుబడి పనిచేస్తున్నారని చెప్పారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన కార్యకర్తలకు ఆమె నివాళులర్పించారు. అసంఖ్యాక ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలే పార్టీకి రక్షగా నిలుస్తు న్నాయన్నారు. ప్రజల మద్దతే తమకు జీవనాధారమని, దేశంలోని ప్రతి వ్యక్తి కోసం జరిగే పోరాటంలో వెనకడుగు వేయ దని బెనర్జీ స్పష్టం చేశారు. ‘మేం ఏ దుష్ట శక్తులకూ తలవంచబోం. అన్ని రకాల పగ ప్రతీకారాలను పక్కన పెట్టి, సామాన్య ప్రజల కోసం జీవి తాంతం పోరాటం కొనసాగి స్తాం’అని మమత ప్రకటించా రు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ