
బెంగళూరు: బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం చేశారు. తుముకూరులో నిద్ర మాత్రలు మింగారు ఐపీఎస్ అధికారి పవన్ నిజ్జూర్. బళ్లారి అల్లర్ల వ్యవహారం లో ఎస్పీ పవన్ నిజ్జూర్ ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తుముకూరులోని ఓ ఫాం హౌస్ లో ఆత్మహత్య యత్నం చేసిన ఎస్పీ పవన్ నిజ్జూర్. ప్రస్తుతం ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడంలో తలెత్తిన వివాదం కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో రణరంగానికి దారితీసింది. గంగావతి ఎమ్మెల్యే.. మాజీమంత్రి గాలి జనార్దన్‌రెడ్డి, బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి వర్గీయుల మధ్య ఈ వివాదం చెలరేగింది. ఇది చినికి చినికి గాలివానగా మారి చివరకు కాల్పులకు దారితీసింది. కాల్పుల్లో ఒకరు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో 144 సెక్షన్ విధించగా.. ఇవాళ జరగాల్సిన వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమం వాయిదా వేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ