
ఢిల్లి, 03 జనవరి (హి.స.)ఈ కొత్త ఏడాదిలో పండగల సీజన్ కారణంగా విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే సంక్రాంతి సెలవులు రానున్నాయి. ఇదిలా ఉంటే.. ఉత్తర భారతదేశంలో చలిగాలులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. అనేక రాష్ట్రాలు తీవ్రమైన చలితో నూతన సంవత్సరాన్ని స్వాగతించాయి. ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో పొడి చలిగాలులు వీస్తున్నాయి. వాతావరణ శాఖ అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ దృష్ట్యా చలి పెరిగే అవకాశం ఉందని, దీని దృష్ట్యా ఉత్తరప్రదేశ్‌లోని అన్ని పాఠశాలల్లో 5వ తరగతి వరకు జనవరి 5 వ తేదీ వరకు పూర్తిగా మూసి వేయనున్నారు. చలి కారణంగా పాఠశాలలను మూసివేయడంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక సూచనలు జారీ చేశారు. అయితే ఈ సెలవులు జనవరి 1 వరకు మాత్రమే ఉండేది. చలి గాలుల కారణంగా సెలవులను పొడిగించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. దీంతో విద్యార్థులకు మరో ఐదు రోజుల పాటు సెలవులు లభించాయి.
పెరుగుతున్న చలి గురించి ముఖ్యమంత్రి యోగి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను జనవరి 5 వరకు మూసివేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచనల మేరకు, యుపి బోర్డు, ఐసిఎస్‌ఇ-సిబిఎస్‌ఇ నిర్వహిస్తున్న పాఠశాలలతో సహా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు జనవరి 5 వరకు మూసి ఉంటాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV