

ఢిల్లీ.,03జనవరి (హి.స.) అస్సాం శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వరుసగా మూడోసారి అధికారాన్ని సాధించే దిశగా దూసుకెళ్తోందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన తాజా ట్రాకర్ పోల్ వెల్లడిరచింది. 2025 నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు నిర్వహించిన ఈ సర్వే ప్రకారం, మొత్తం 126 స్థానాలు ఉన్న శాసనసభలో బీజేపీ 69-74 సీట్లు గెలుచుకొని మెజారిటీ సాధించే అవకాశముంది. ఎన్‌డీఏ భాగస్వాములతో కలిపితే మొత్తం సీట్లు 90 మార్క్‌ను తాకే అవకాశం ఉందని తేలింది. ప్రతిపక్షంలో ఐక్యత లేని పరిస్థితుల్లో బీజేపీకి ఇది కలిసి వస్తోందని సర్వేలో వెల్లడయ్యింది.
వ్యూహాత్మక పొత్తులు, సంక్షేమ పథకాలు, అన్ని వర్గాల మద్దతుతో అస్సాంలో బీజేపీ పట్టు కొనసాగుతోంది. ఈ సర్వే పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్, పొలిటికల్ ఎనలిస్ట్ డా. రాజన్ పాండే నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. ‘‘ఈ ట్రాకర్ పోల్ ప్రస్తుత సమయంలో అస్సాం ఓటర్ల మనోభావాలను ప్రతిబింబిస్తోంది. అధికార ప్రయోజనాలకే పరిమితం కాకుండా విభిన్న వర్గాలతో బీజేపీకి బలమైన అనుసంధానం ఏర్పడినట్లు ఈ సర్వే స్పష్టం చేస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ