మగువలకు శుభవార్త.. పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గిందంటే..!
ముంబై, 03 జనవరి (హి.స.)కొత్త సంవత్సరం మొదటి వారంలో బంగారం, వెండి ధరలు గణనీయమైన హెచ్చుతగ్గులను చవిచూశాయి. ఇండియా బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) డేటా ప్రకారం ఈ వారం బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయి. ఐదు రోజుల ట్రేడింగ్‌లో బంగారం 10
gold


ముంబై, 03 జనవరి (హి.స.)కొత్త సంవత్సరం మొదటి వారంలో బంగారం, వెండి ధరలు గణనీయమైన హెచ్చుతగ్గులను చవిచూశాయి. ఇండియా బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) డేటా ప్రకారం ఈ వారం బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయి. ఐదు రోజుల ట్రేడింగ్‌లో బంగారం 10 గ్రాములకు రూ.1,990 వరకు తగ్గింది. అదే సమయంలో వెండి కూడా భారీగానే తగ్గింది. పది గ్రాములకు రూ.890 వరకు తగ్గింది.

అయితే ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 380 రూపాయలు తగ్గింది. అలాగే 22 క్యారెట్లపై 280 రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. ఇక వెండి విషయానికొస్తే.. ఇక్కడ మాత్రం భారీగా తగ్గింది. కిలో వెండిపై ఏకంగా 4000 రూపాయల వరకు దిగి వచ్చింది.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,820 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,500 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర తగ్గిన తర్వాత రూ.2,40,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో రూ.2,56,000 వద్ద కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande