
ముంబై, 02 జనవరి (హి.స.)కొత్త ఏడాదిలో పసిడిప్రేమికులకు ఊహించని షాక్ తగుల్తోంది. బంగారం ధర భారీగా దూసుకెళ్తోంది. జనవరిలో మొదటి రెండు రోజుల్లో బంగారం ధర భారీగా పెరిగిపోయింది. వెండి ధర కూడా భారీగీ పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
జనవరి 2న హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 24 క్యారట్ గోల్డ్ ధర ఏకంగా రూ.1,140 పెరిగి రూ.1,35,060 నుంచి రూ.1,36,200కి చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.1,050 పెరిగి రూ.1,23,800 నుంచి రూ.1,24,850కి చేరుకుంది. ఇక 18 క్యారట్ గోల్డ్ ధర రూ.860 పెరిగి రూ.1,01,290 నుంచి రూ.1,02,150కి చేరుకుంది.
తులం బంగారం ధర, బంగారం ధరలు ఈ రోజు today, తులం బంగారం ఎంత, ఈ రోజు బంగారం ధర 24 కాస్ట్, ఈరోజు బంగారం ధర 22kt, హైదరాబాద్ బంగారం ధర, హైదరాబాద్ లో ఈరోజు బంగారం ధర, ఈరోజు బంగారం ధర విశాఖలో 24 క్యారెట్లు, ఈరోజు బంగారం ధర
అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 4373.26 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతుండగా, ఔన్స్ వెండి ధర 73.36 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. మొదటి రెండు రోజుల్లో బంగారం ధర పెరిగినంత మాత్రానా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని అంచనా వేయలేం. కాబట్టి గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు కాస్త ఆచితూచి వ్యవహరించడం మంచిది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV