
ప్రయాగ్‌రాజ్/ఢిల్లీ.,03జనవరి (హి.స.)
ఉత్తరాదిన ‘మాఘ మేళా’ శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యింది. దీంతో పుణ్య స్నానాలు చేసేందుకు జనం కుంభమేళా తరహాలో తరలివస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గల త్రివేణి సంగమం వద్ద ‘పుష్య పౌర్ణమి’ని పురస్కరించుకుని మాఘమేళా ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
గజగజ వణికించే చలిని సైతం లెక్కచేయకుండా లక్షలాది మంది భక్తులు గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. నేడు(శనివానం) దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల మంది భక్తులు గంగానది, సంగమం వద్ద స్నానాలు ఆచరిస్తారనే అంచనాలున్నాయని ప్రయాగ్‌రాజ్ డివిజనల్ కమిషనర్ సౌమ్య అగర్వాల్ తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల సమయానికే సుమారు 9 లక్షల మంది పుణ్యస్నానాలు పూర్తి చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ‘
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ