
ఢిల్లీ.,03జనవరి (హి.స.) ఆర్ఎస్ఎస్ ఏ రాజకీయ పార్టీకి రిమోట్ కంట్రోల్ కాదని.. సమాజాన్ని నిర్మించే ఒక సంస్థ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని రవీంద్ర భవన్‌లో జరిగిన కార్యక్రమంలో హిందూత్వం, భాష-సంస్థాగత విస్తరణ, ఆర్ఎస్ఎస్-బీజేపీ సంబంధాలపై మాట్లాడారు. ఆర్ఎస్ఎస్‌ను బీజేపీ లేదా విశ్వహిందూ పరిషత్ కోణంలో చూడొద్దన్నారు. హిందువులను శాంతియుతంగా సంఘటితం చేసేందుకే సంఘ్ స్థాపించబడిందని చెప్పారు. హిందూ మతం ఒక కులం కాదని.. అన్ని వర్గాలు.. మతాలను గౌరవించే వైఖరి అని స్పష్టం చేశారు. ప్రస్తుతం సంఘ్‌లో 6 మిలియన్ల మంది స్వచ్ఛందంగా సేవకులుగా ఉన్నారని.. దేశంలో హిందువులుగా గుర్తించే వారి సంఖ్య దాదాపు 1 బిలియన్ మాత్రమే అని చెప్పారు. పట్టణ ప్రాంతాలు, ఇతర ప్రాంతాలను ఆర్ఎస్ఎస్ చేరుకోలేకపోయిందని
వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ