ఉస్తాద్ భగత్ సింగ్ హీట్ పెంచిన దేవిశ్రీ ప్రసాద్
హైదరాబాద్, 05 జనవరి (హి.స.) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ''ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరూ కలిసి పని చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న
దేవిశ్రీప్రసాద్


హైదరాబాద్, 05 జనవరి (హి.స.)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరూ కలిసి పని చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన 'దేఖ్ లేంగే సాలా' సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ తన ట్రేడ్మార్క్ మేనరిజమ్స్ మరియు ఎనర్జిటిక్ డ్యాన్స్తో ఫ్యాన్స్ని అలరించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మాస్ ట్యూన్స్, పవన్ స్టైలిష్ లుక్స్ ఈ పాటకు చార్ట్బస్టర్గా నిలిపాయి. శ్రీలీల మరియు రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 2026లో గ్రాండ్గా విడుదల కానుంది.

ఇదిలా ఉండగా, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (DSP) స్వయంగా ఈ పాటకి స్టెప్పులు వేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. విదేశీ వీధుల్లో ‘దేఖ్ లేంగే సాలా' పాటకు తనదైన స్టైల్లో దేవి వేసిన స్టైలిష్ స్టెప్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande