
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ.,05జనవరి (హి.స.)ప్రపంచ వ్యాప్తంగా వెనిజులా వ్యవహారం కాకరేపుతున్న వేళ్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రధాని మోడీ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆదివారం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో ట్రంప్ మాట్లాడారు. ‘‘నేను సంతోషంగా లేనని ప్రధాని మోడీకి తెలుసు. మోడీ చాలా మంచి వ్యక్తి. నన్ను సంతోషపెట్టడం ముఖ్యం. వారు వ్యాపారం చేస్తారు. మేము సంకాలు విధిస్తాం.’’ అని అన్నారు. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందుకు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడం ఆపాలి.. దిగుమతులు కొనసాగిస్తే మాత్రం భారతదేశంపై కొత్త సుంకాలు విధించే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు. ఈ విషయంలో తాను సంతోషంగా లేనని మోడీకి తెలుసు అని చెప్పుకొచ్చారు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక గతేడాది ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించారు. భారత్‌పై తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారతదేశంపై 50 శాతం సుంకం విధించినట్లైంది. ఈ పరిణామంతో రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తాజాగా మరోసారి భారత్‌ను ట్రంప్ హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ