శంభాజీనగర్లో మసీదు కూల్చివేత ఎంఐఎం అధినేత ఓవైసీ ఆగ్రహం
తెలంగాణ, 07 జనవరి (హి.స.) మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ లో వర్ఫ్ భూమిలో ఉన్న మసీదు కూల్చివేతలపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని తుర్క్ మాన్ గేట్ వద్ద ఫైజ్-ఎ-ఇలాహి మసీదు సమీపంలో జరిగిన కూల్చివేతలను ఆయన తీవ్రంగా ఖండించార
ఓవైసీ


తెలంగాణ, 07 జనవరి (హి.స.) మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ లో వర్ఫ్ భూమిలో ఉన్న మసీదు కూల్చివేతలపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని తుర్క్ మాన్ గేట్ వద్ద ఫైజ్-ఎ-ఇలాహి మసీదు సమీపంలో జరిగిన కూల్చివేతలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ భూమి పూర్తిగా వర్ఫ్ బోర్డుకు చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ (RSS) నేపథ్యం ఉన్న 'సేవ్ ఇండియా ఫౌండేషన్' వేసిన పిటిషన్పై నవంబర్ 12న ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చిందని, అయితే కోర్టు ఆదేశించిన సర్వేలో వర్ఫ్ బోర్డును పక్షం (party)గా చేర్చకపోవడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande