
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ.,08జనవరి (హి.స.)అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న పలు అంతర్జాతీయ సంస్థలు, ఒప్పందాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
మొత్తం 66 సంస్థలకు యూఎస్ తన మద్దతును నిలిపివేస్తున్నట్లు వైట్‌హౌస్ పేర్కొంది (US exits from 66 international organisations). ఇందులో 31 ఐక్యరాజ్య సమితికి చెందిన సంస్థలతో పాటు మరో 35 ఐరాసయేతర సంస్థలు ఉన్నట్లు తెలిపింది. భారత్, ఫ్రాన్స్ నేతృత్వంలోని ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు తెలిపింది. మరికొన్ని కీలక సంస్థల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించింది. ఇక, యూఎన్‌కు చెందిన కీలకమైన ఇంటర్నేషనల్ లా కమిషన్, ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్, ఐరాస పాపులేషన్ ఏజెన్సీతో పాటు మరికొన్నింటినుంచి కూడా బయటకు వస్తున్నట్లు తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ