
న్యూఢిల్లీ, 09 జనవరి (హి.స.)
బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. 'ల్యాండ్ ఫర్ జాబ్స్' స్కామ్ కేసులో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, కుమార్తె మీసా భారతిపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐ మోపిన అభియోగాలను సమ్మతించింది. ఈ కేసులో నిందితులు ఒక క్రిమినల్ సిండికేట్గా ఏర్పడి కుట్రకు పాల్పడ్డారని స్పెషల్ జడ్జి కామెంట్ చేశారు.
కాగా, 2004 నుంచి 2009 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా రైల్వేలో గ్రూప్-డీ ఉద్యోగాలు ఇచ్చి, అందుకు ప్రతిఫలంగా అభ్యర్థుల నుంచి తక్కువ ధరకు భూములను తమ కుటుంబ సభ్యుల పేరిట రాయించుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో జరిగిన స్కామ్పై సీబీఐ విచారణకు ఆదేశించగా.. 'ల్యాండ్ ఫర్ జాబ్స్' స్కామ్కు సంబంధించి లోతుగా విచారణ చేపట్టి పక్కా ఆధారాలను అధికారులు కోర్టుకు అందజేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు