స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి రేటు..
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.cf3{font-family:Garamond;fon
Gold seizure


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ముంబై, ,09, జనవరి (హి.స.)

వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు గురువారం కాస్త ఉపశమనం కలిగించాయి. స్వల్పంగా తగ్గుదల నమోదు చేశాయి. అయితే వెండి మాత్రం జోరు చూపిస్తూనే ఉంది. గురువారం కూడా పెరుగుదల నమోదు చేసింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండిపై మదుపర్లు దృష్టి సారిస్తున్నారు (Gold prices). డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం, వెండి ధరల డిమాండ్‌కు కారణంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ రోజు (జనవరి 8న) ఉదయం 6:30 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,38,260కి చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,26,740కి చేరింది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,39,640కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 1,28,010కి చేరుకుంది. మరోవైపు వెండి కూడా జోరు చూపిస్తోంది. నిన్నటితో పోల్చుకుంటే కిలోకు వంద రూపాయల మేర పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)హైదరాబాద్‌లో రూ. 1, 38, 260, రూ. 1, 26, 740 ,విజయవాడలో రూ. 1, 38, 260, రూ. 1, 26, 740.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande