నిలకడగా సోనియాగాంధీ ఆరోగ్యం.. త్వరలో డిశ్చార్జ్
న్యూఢిల్లీ, 08 జనవరి (హి.స.) కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ అస్వస్థత కారణంగా ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రి లో చేరిన విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో గత సోమవారం రాత్రి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్ర
సోనియాగాంధీ


న్యూఢిల్లీ, 08 జనవరి (హి.స.)

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్

సోనియా గాంధీ అస్వస్థత కారణంగా ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రి లో చేరిన విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో గత సోమవారం రాత్రి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు ఆమె శరీరం బాగా సహకరిస్తోందని ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ అధికారికంగా ప్రకటించారు. సోనియా గాంధీని ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షిస్తోందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఢిల్లీలో ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన చలి, వాయు కాలుష్యం కారణంగా సోనియా గాంధీకి 'బ్రాంకియల్ ' తిరగబెట్టినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ముందుజాగ్రత్త చర్యగా ఆమెను అడ్మిట్ చేసుకున్న వైద్యులు, ప్రస్తుతం యాంటీబయాటిక్స్, ఇతర అవసరమైన మందులతో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతుందని, వైద్యుల సూచనల మేరకు ఒకటి, రెండు రోజుల్లో ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande