
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ.,08జనవరి (హి.స.)బిహార్‌లోని ఆభరణాల వర్తక సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులు, హిజాబ్, హెల్మెట్ వంటి వాటితో ముఖాలను కప్పుకొని వచ్చే కస్టమర్లకు ఆభరణాలు చూపించడం, విక్రయించడం చేయకూడదని నిర్ణయించింది. దీనిని వెంటనే అమల్లోకి తెస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆల్ ఇండియా జ్యూయలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ (ఏఐజేజీఎఫ్) ప్రకటించింది. ‘ముఖాలను కప్పుకొని వచ్చే కస్టమర్లకు ఆభరణాలు విక్రయించవద్దని నిర్ణయించాం. హిజాబ్, మాస్కులు, హెల్మెట్ తదితర వాటితో ముఖం కనిపించకుండా దుకాణాల్లోకి వచ్చే వారికి విలువైన ఆభరణాలు చూపించబోం. వినియోగదారులు, దుకాణాల యజమానుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఏఐజేజీఎఫ్ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు అశోక్ కుమార్ వర్మ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ