
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ.,08జనవరి (హి.స.)ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025-26)లో భారత జీడీపీ 7.4 శాతం వృద్ధి చెందుతుందని, ఇది 2024-25లో 6.5 శాతంగా ఉన్న వృద్ధి కంటే ఎక్కువ అని కేంద్రం బుధవారం ముందస్తు అంచనాల్లో తెలిపింది. కేంద్రం విడుదల చేసిన ఈ గణాంకాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. రష్యా నుంచి భారత్ చమురు కొంటున్న కారణంగా, యూఎస్ భారత్‌పై 50 శాతం సుంకాలను విధించింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారత జీడీపీ మెరుగైన వృద్ధిని సాధించింది.
స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇప్లిమెంట్ మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంచనా వేయబడిన 7.3 శాతం రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ (GVA) వృద్ధి రేటులో సేవల రంగంలో మంచి వృద్ధి, జీడీపీ వృద్ధికి ప్రధాన కారణంగా ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉత్పత్తి, నిర్మాణ రంగాలు ఏడు శాతం వృద్ధి చెందుతాయని అంచనా వేయగా, వ్యవసాయం, విద్యుత్, నీటి సరఫరా వంటి యుటిలిటీ సేవల వృద్ధి మితంగా ఉంటాయని భావిస్తున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ