బెంగళూరులో దారుణం.. ఓం శక్తి మాలధారులపై రాళ్ల దాడి
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-fa
బెంగళూరులో దారుణం.. ఓం శక్తి మాలధారులపై రాళ్ల దాడి


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf4{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

బెంగళూరు-/ఢిల్లీ.,05జనవరి (హి.స.). ఓం శక్తి మాలధారులపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి ఓం శక్తి మాలధారులు పెద్ద ఎత్తున రథయాత్ర నిర్వహించారు. స్థానికంగా ఉండే ఓం శక్తి గుడి నుంచి యాత్ర మొదలైంది. భక్తులు జగజ్జీవన్ రామ్ నగర్‌లోకి రాగానే ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

దీంతో ఆగ్రహానికి గురైన భక్తులు జగజ్జీవన్ రామ్ నగర్‌ పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లారు. తమపై ఇతర మతానికి చెందిన వారు దాడికి దిగారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నిరసనలకు దిగారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఆ ప్రాంతంలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. వెస్ట్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ యతీష్ ఎన్‌బీ సంఘటనా స్థలం దగ్గరకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి, వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పరిస్థితి తమ కంట్రోల్‌లో ఉందని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande