
వాషింగ్టన్ డిసి, 05 జనవరి (హి.స.)
వివిధ కారణాలతో అమెరికా వెనిజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్ తర్వాత వెనిజులాను తామే తాత్కలికంగా పరిపాలిస్తామని ట్రంప్ ప్రకటించారు. అలాగే చమురు పరిశ్రమను నియంత్రించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆలోచన వెనుక ఉన్న ఉద్దేశాలను 'ఫారిన్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ ఫెలో జాన్ సిటిలైడ్స్ వివరించారు. వెనిజులాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వర్గాలను ఆయన మాదకద్రవ్యాల ఉగ్రవాద నేర ముఠాలు గా అభివర్ణించారు. చట్టబద్ధంగా అమెరికాకు చెందాల్సిన ఆదాయాన్ని, ఆస్తులను ఈ ముఠాలు లాక్కున్నాయని, ఆ డబ్బును తమ అక్రమ కార్యకలాపాల కోసం వాడుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.
అమెరికా తదుపరి కార్యాచరణ గురించి వివరిస్తూ.. వెనిజులాలో భవిష్యత్తులో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం ఏర్పడుతుందని అమెరికా ఆశిస్తోందని జాన్ తెలిపారు. ఆ కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ద్వారా వెనిజులా చమురు పరిశ్రమను తిరిగి పునరుద్ధరించడమే అమెరికా లక్ష్యమని చెప్పారు. ఈ చర్య కేవలం అమెరికా ప్రయోజనాల కోసమే కాకుండా, వెనిజులా ప్రజలకు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చేలా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV