
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
చెన్నై/ఢిల్లీ.,06,జనవరి (హి.స.): తిరుప్పరకుండ్రం కొండపై కార్తిక దీపం వెలిగించే విషయంలో తమిళనాడు డీఎంకే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మదురైలోని ఈ కొండపై ఉన్న దీప స్తంభంలో దీపం (Thirupparankundram Lamp) వెలిగించేందుకు అనుమతినిస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను మద్రాసు హైకోర్టు (Madras HC) తాజాగా డివిజన్ బెంచ్ సమర్థించింది. ఆ స్తంభంలో దీపం వెలిగించొద్దని ఆగమశాస్త్రంలో పేర్కొన్నట్లు వ్యాజ్యదారులు బలమైన ఆధారాలు చూపించలేకపోయారని డివిజన్ బెంచ్ వెల్లడించింది. (Tamil Nadu Deepam Row)
ఈ సందర్భంగా దీపం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను ధర్మాసనం తిరస్కరించింది. ఏడాదిలో ఒకరోజు ఆ స్తంభంలో దీపం వెలిగిస్తే శాంతిభద్రతలకు ఆటంకం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం హాస్యాస్పదం అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని అనవసరంగా రాజకీయం చేశారంటూ కోర్టు అభిప్రాయపడింది. ఈ దీపస్తంభం సుబ్రమణ్యస్వామి ఆలయానికి చెందినదే అని న్యాయస్థానం స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ